July 30, 2006

నా చెలి......ఈ బ్లాగ్ లో నా తొలి కవిత


ఆకాశంలో వెలిగే వెన్నెల దీపం
స్వర్గం నుండి దిగి వచ్చిన పారిజాత పుష్పం
నింగి లోని జాబిల్లి, నేల మీది సిరిమల్లి
మబ్బు నుంచి తొలి చినుకు, కొమ్మ లోని చిగురాకు
ప్రకృతి లోని అందాలు చాలవే... నా చెలినే వర్నించేందుకు

సుందరం, సుమధురం, సుకుమారం సోయగం
వయసే వయ్యారం, సొగసే సింధూరం
వలపే నయగారం, మనసే మకరందం
వదనం కోమలం, విరిసే కమలం
పలుకే బంగరం, పడమటి సంధ్యా రాగం
తెలుగు బాషలోన పదాలెన్నో ఉన్నయి......
నా చెలిని వర్నించ కరువయ్యాయి

చిరునవ్వు లో విరబూసెను సిరి మల్లెలు
సిగ్గుల్లో సిందూరాలు, బుగ్గల్లో మందారలు
సన్నజాజి ముక్కు పైన సంపెంగ ముక్కుపుడకలు
కనులే కలువ రేఖలు, కురులలో కనకాంబరాలు
ఎర్రని పెదవులలో నిండెనులే రోజాపూ రంగులు
ఈ నేల పైన ఎన్నో పువ్వులు పూసాయి......
నా చెలి అందం చూసి చిన్నబొయయి

aakaasaMloo veligE vennela dheepaM
svargaM nuMdi dhigi vachchina paarijaatha puShpaM
niMgi looni jaabilli, nela meedhi sirimalli
mabbu nuMchi tholi chinuku, komma looni chiguraaku
prakruthi looni aMdhAlu chaalave... naa chelinE varniMchEMdhuku

suMdharaM, sumaDhuraM, sukumaaraM, sOyagaM
vayasE vayyaaraM, sogasE siMDhooraM
valapE nayagaaraM, manasE makaraMdhaM
vadhanaM kOmalaM, virisE kamalaM
palukE baMgaraM, padamati saMDhyaa raagaM
thelugu baaShalOna padhaalennO unnayi......
naa chelini varniMcha karuvayyaayi

chirunavvu loo viraboosenu siri mallelu
siggulloo siMdhooraalu, buggalloo maMdhaaralu
sannajaaji mukku paina saMpeMga mukkupudakalu
kanulE kaluva rEkhalu kurulaloo kanakaaMbaraalu
errani pedhavulaloo niMdenulE rOjaapoo raMgulu
ee nEla paina ennoo puvvulu poosaayi......
naa cheli aMdhaM choosi chinnaboyayi

2 comments:

  1. Anonymous4:54 AM

    nice to see
    that u into poetry also.those r very nice but may i know for whom did u write it????????????

    ReplyDelete
  2. Anonymous10:17 AM

    Hey this sounds cool....So who is "SHE"...May we all know?Atleast I'm curious...

    ReplyDelete