May 8, 2011

అమ్మ

మాట నేరుస్తూ మనిషి పలికే తొలి మాట అమ్మ
పలికే అన్ని మాటల్లోకి తీయని మాట అమ్మా
ప్రతి రోజు ప్రతి పనిలో అన్ని మాటల్లో ఊతపదం అమ్మ
రోజంతా తిరిగి ఇంటికి రాగానే అమ్మ, నిద్రలేవగానే అమ్మ
ఆవలిస్తే అమ్మ, అక్కలేస్తే అమ్మ, అలసట వచ్చినా అమ్మ
తుమ్మినా, దగ్గినా, తలనొప్పి వచ్చినా, దెబ్బ తగిలినా,
అమ్మా... అని నిన్ను తలవకుండా ఉండలేనమ్మ
పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు అన్నిట్లోనూ అమ్మ
జీవితంలో చెరిగిపోని రూపం, వీడిపొలేని బంధం అమ్మ
అంతెందుకు ఈ జీవితానికే అసలైన అర్థం అమ్మ
ఎందుకంటే ఈ జీవికి జీవం పోసింది నువ్వే అమ్మ

February 12, 2011

మళ్ళీ పుట్టని నాలో మనిషిని -1

ఆ రోజు (అక్టోబర్ 12, 2010) మధ్యాహ్నం లంచ్ చేయటానికి మా ఆఫీసు పక్కన ఉన్న టైసన్స్ మాల్ కి వెళ్ళాను.
నేను ఫుడ్ కోర్టులో ఒక సాండువిచ్చు (sandwitch), ఒక కూల్ డ్రింక్ (cool drink), తీసుకొని అక్కడే కారిడారు మధ్యలో బల్లలు, కుర్చీలు వేసి ఉంటె అక్కడ కూర్చొని తింటున్నాను. అటు ఇటు వచ్చి పోయే వాళ్ళని గమనిస్తూ ఉన్నాను.