February 12, 2011

మళ్ళీ పుట్టని నాలో మనిషిని -1

ఆ రోజు (అక్టోబర్ 12, 2010) మధ్యాహ్నం లంచ్ చేయటానికి మా ఆఫీసు పక్కన ఉన్న టైసన్స్ మాల్ కి వెళ్ళాను.
నేను ఫుడ్ కోర్టులో ఒక సాండువిచ్చు (sandwitch), ఒక కూల్ డ్రింక్ (cool drink), తీసుకొని అక్కడే కారిడారు మధ్యలో బల్లలు, కుర్చీలు వేసి ఉంటె అక్కడ కూర్చొని తింటున్నాను. అటు ఇటు వచ్చి పోయే వాళ్ళని గమనిస్తూ ఉన్నాను.


ఇంతలో అటుగా ఇద్దరు వయసు మళ్ళిన వాళ్ళు నడిచి వస్తున్నారు. దెగ్గర దెగ్గర ఒక అరవై - డెబ్బై (60-70) ఏళ్ళు అల ఉంటాయేమో. చాల మెల్లగానడుస్తున్నారు, అయన ఒక చేతిలో కర్ర, ఇంకో చెయ్యి ఆవిడ బుజం మీద వేసి మెల్లగా నడుస్తూ వస్తున్నారు. నేను వాళ్ళనిచూస్తూనే ఉన్నాను. ఒక వైపు జాలిగా ఉంది, కాని మరోవైపు వాళ్ళని చూస్తే ముచ్చటేసింది. అంతలో ఆయన నన్నుచూసి నవుతూ హాయ్ ఆని చేతితో పలకరించారు, నేను నవ్వుతూ హాయ్ చెప్పాను. ఆయన వెళ్లి నెమ్మదిగా అటు పక్కబల్ల దెగ్గర కూర్చున్నారు, ఆవిడ వెళ్లి సబ్వే (subway) నుంచి ఒక సాండువిచ్చు (sandwitch), ఒక కూల్ డ్రింక్ (cool drink), రెండు స్ట్రాలు (straws) తెచ్చింది.

నేను నా లంచ్ పూర్తి చేసుకొని లేచి వెళ్తుండగా వాళ్ళ వైపు చూస్తూ నడిచాను. ఆయన నన్ను చూసి చిన్నగా పలకరిస్తున్నట్టు నవ్వారు. నేను వెంటనే ఆగి ఏదో అడగబోయాను . అంతలో ఎక్కడనుంచి బాబు హైదరబాద అన్నారు. నేను అవునండి, మిమ్మల్ని చూస్తే ఎందుకో బాగా తెలిసిన వాళ్ళ లాగ అనిపించారు ఆని చెప్పాను. వాళ గురించి వాళ్ళ పిల్లల గురించి చెప్పారు, నా గురించి నేను ఎం చేస్తున్నానో అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు ఎప్పుడో 30-40 ఏళ్ళ కిందట అమెరికా కి వచ్చారట. ఆయనకీ బ్యాక్ ప్రాబ్లం ఉంది, ఇప్పటికే రెండు బ్యాక్ సుర్జరీస్ అండ్ రెండు ఓపెన్ హార్ట్
సుర్జరీస్ అయ్యాయి అంట. ఆమెకి కాళ్ళతో ప్రాబ్లం అంట, రెండు సుర్జరీస్ జరిగాయి అంట. అయన నెమ్మదిగా డ్రైవ్ చేయగేలరు, కాని కర్ర సహాయం లేకుండా నడవలేరు, ఆమె డ్రైవ్ చెయ్యలేరు అంట. వాళ పిల్లలు ఇదరు దేగ్గరిలోనే ఉంటారు అంట. ఒకే ఇంట్లో వీళ్ళు కింద పోర్షన్ లో ఉంటె పిల్లలు పైనపోర్షన్ లో ఉనతారు అంట. వాళ్ళ మాటలు బట్టి వాళ్ళ కి చాల కష్టాలు ఉన్నాయి ఆని అనిపించింది, కాని వాళ్ళ సఖ్యత, అనుబంధం, ఆప్యాయత చూస్తే ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉన్న్నారు. ఒకరు ఇంకొకరిని నడిపిస్తే, ఒకరు ఇంకొకరి కోసం కారు నడిపిస్తున్నారు. ఒక సాండువిచ్చు ఇద్దరు చేరి సగంపంచుకున్నారు, ఒక కూల్ డ్రింక్ రెండు స్ట్రాలు. వారి మోఖాలలో ఆ కష్టాలు,బాధలు కనిపించలేదు నాకు. నాతోమాట్లాడేటప్పుడు చాల సంతోషంగా మాట్లాడారు. నాకు వాళ్ళని కలిసి మాట్లాడినందుకు చాల సంతోషం కలిగింది. నేనువెల్లిపోయేటప్పుడు నన్ను దీవించారు. ఏంటో తెలియని ఒక మంచి భావన. జీవితంలో వీరి నుంచి, ఈ సంఘటన నుంచి ఏదో తెలుసుకున్నాను, ఏదో నేర్చుకున్నాను అనే భావన. తెలియని మనుషులని కలిసి ఆ వారితో ఏదో తెలియని బంధం ఉందనే భావన. వాళ్ళు ఇద్దరు ఎంతో జీవితాన్ని చూసిన వాళ్ళు, వారితో గడిపిన ఆ కొన్ని క్షణాలలో నేను ఎంతో కొంత నేర్చుకున్నాను అనే భావన. వారి అనుభవం నాకు పాటాలు నేర్పింది అనే భావన. నాలో మనసుని గుర్తుచేసి, నాలో మనిషిని నాకు మళ్ళీ చూపించింది అనే భావన.
మళ్ళీ పుట్టని నాలో మనిషిని.

No comments:

Post a Comment