July 6, 2010

నీ జీవితం.. నీ ప్రశ్న.. నీ సమాధానం..

నిన్నటి సూర్యుడు అస్తమిస్తే రేపటి ఉదయం ఆగిపోతుందా?

లేక,
చీకటి చెరలను చీల్చుకుంటూ కొత్త వెలుగులు తీసుకొస్తుందా?

అడ్డంకులు వస్తే నదీ ప్రవాహం సుముద్రం చేరనంటుందా?
లేక,
గమ్యం చేరి అలగా ఎగిసిపడి నింగిని తాకాలంటుందా?

ఆకులు రాలిన కొమ్మ నిరాశతో మిగిలిపోతుందా
?
లేక,
తరలి వచ్చే వసంతం కోసం వేచి చూసి చిగురిస్తుందా?


మరి,
ఏ కష్టమో నష్టమో వచ్చినదని జీవితం ఆగిపోవాలా?
లేక,
కొత్త ఆశలతో ఆశయాలతో ముందుకు సాగిపోవాలా?

ఏది ఏమయినా నీ జీవితం
నీ ప్రశ్నకు సమాధానం నీలోనే దొరుకుతుంది
నీ సమస్యకు పరిష్కారం నీ ప్రయత్నంతో లభిస్తుంది

No comments:

Post a Comment