September 22, 2010

సాహిత్యంలో జీవిత సత్యం

సాహిత్యం : 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి
జీవితం యొక్క విలవలు తెలిపే ఎన్నో పాటలు విన్నాము. అందులో సీతారామ శాస్త్రి గారు రాసినవి చాల ఉన్నాయి. అందులో సులువైన పదాలతో రాసినవి, నాకు నచిన కొన్ని
మచ్చుకకి.

సినిమా: మొదటి సినిమా
నిన్నైనా నేడైనా రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా
ఏ పూటకి ఆ పూటే బ్రతుకంతా సరికొత్తే
ఆ వింతలు గమనించే వీలున్నది కాబట్టే
మన సొంతం కాదా ఈ క్షణమైనా

ఎటు నీ పయనమంటే నిలిచేదెక్కడంటే
మనలా బదులు పలికే శక్తి ఇంకే జీవికి లేదే
ఎదలో ఆశ వెంటే ఎగసే వేగముంటే
సమయం వెనుకపడదా ఊహ తనకన్నా ముందుంటే
మన చేతుల్లో ఏముంది అనే నిజం నిజమేనా
మనకే ఎందుకు పుట్టింది లేని పోని ఈ ప్రశ్న
మనసుకున్న విలువ మరచిపోతే శాపం కాదా వరమైనా

కసిరే వేసవైనా ముసిరే వర్షమైనా
గొడుగే వేసుకుంటే వద్దని అడ్డంపడుతుందా
మసకే కమ్ముకున్నా ముసుగే కప్పుకున్నా
కనులే కలలుగంటే నిద్దరేం కాదని అంటుందా
నిట్టూరుపు తరిమేస్తుంటే పారిపోదా సంతోషం
ఆయువు ఇంకా మిగిలుంటే మానిపోదా ప్రతి గాయం
నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవదా అమృతమైనా



చేదైనా .. బాధైనా .. అన్ని మామూలే ..
మేలైనా .. కీడైనా .. ఎన్నో కొన్నాలే ..
మలుపేదైనా నీ పాదం నిలిచి పోకుంటే ..
ఎటువైపైనా నీ తీరం కలిసి వస్తుందే ..
----------------------------------------------------------------
సినిమా: చిరునవ్వుతో
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లె కష్టమొస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటు, కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా, లేని పోని సేవ చేయకు

ఆశలు రేపినా అడియాసలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
ఆశలు రేపినా అడియాసలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండ ఉండగలమా
------------------------------------------------------------


No comments:

Post a Comment